ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమా షూటింగ్‌ లో ఉన్నాడో తెలుసా?

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి.కనుక ఆయన ఎప్పుడు ఏ సినిమా షూటింగ్‌ లో ఉంటున్నాడు అనే విషయాన్ని వెంటనే చెప్పడం కష్టంగా ఉంది.

 Prabhas Salaar Movie Shooting Started-TeluguStop.com

మొన్నటి వరకు రాధే శ్యామ్‌ సినిమా షూటింగ్‌ లో ఉన్నాడు.ఇటీవలే రాధే శ్యామ్‌ కు గుమ్మడి కాయ కొట్టారు అంటూ వార్తలు వచ్చాయి.

కనుక ఇప్పుడు ఆయన ఏ సినిమా షూట్‌ లో జాయిన్ అయ్యాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం ఆయన మూడు సినిమాలు సలార్‌.

 Prabhas Salaar Movie Shooting Started-ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమా షూటింగ్‌ లో ఉన్నాడో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆదిపురుష్‌ మరియు ప్రాజెక్ట్ కేలు షూటింగ్‌ దశలో ఉన్నాయి.కనుక ఆ మూడు సినిమాల్లో ఏ సినిమా షూట్‌ లో ఉన్నాడు.

ఇవి కాకుండా కొత్త సినిమా చర్చలు ఏమైనా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నాడా అంటూ అనుకుంటూ ఉన్న సమయంలో ఇండస్ట్రీ వర్గాల ద్వారా కీలక సమాచారం అందింది.

రాధే శ్యామ్ తర్వాత సలార్‌ సినిమా షూట్‌ లో ప్రభాస్ జాయిన్ అయ్యాడు.

ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ను ఇటీవలే పునః ప్రారంభించారు.రికార్డు స్థాయిలో ఈ సినిమాకు సంబందించి అంచనాలు ఉన్నాయి.కేజీఎఫ్‌ దర్శకుడు అవ్వడం వల్ల సలార్‌ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ముఖ్యంగా యాక్షన్‌ సినిమాల ప్రియులు ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

Telugu #salaar, Aadipurush, Director Prasanth Neel, Film News, Movie News, Pan India Movie, Prabhas, Prabhas Movies Update, Radeshyam-Movie

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను సలార్‌ దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.కేజీఎఫ్ 2 ఒక వైపు విడుదలకు సిద్దం అవుతుంది.కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న ఆ సినిమాను ఎప్పటికి విడుదల చేయబోతున్నది త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఇక సలార్‌ ను కూడా ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి వచ్చే సమ్మర్‌ కు విడుదల చేస్తారేమో చూడాలి.సలార్‌ షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత ఆదిపురుష్‌ లో ప్రభాస్ జాయిన్ అవుతాడు.

ఆ తర్వాత ప్రాజెక్ట్‌ కే సినిమా షూట్‌ లో ప్రభాస్ జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

#Pan India #Prabhas #Aadipurush #Salaar #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు