సలార్‌ ను నెం.1 గా నిలబెట్టిన అమెజాన్‌ ప్రైమ్‌, ఆకాశమే హద్దుగా ప్రభాస్ క్రేజ్‌

బాహుబలి మరియు సాహో సినిమా లతో ఆల్ ఇండియా సూపర్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్‌ సినిమా తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌ మరియు ఓం రౌత్‌ దర్శకత్వంలో ఆది పురుష్‌ సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.ఈ మూడు సినిమా లు కూడా పాన్ ఇండియా మూవీస్ గా రూపొందుతున్నాయి.

 Prabhas Salaar Movie Release In Amazon Prime-TeluguStop.com

రాధే శ్యామ్ సినిమా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.జులై లో సినిమా రాబోతుంది.

ఇక సలార్‌ మూవీ షూటింగ్‌ ఇటీవలే జరిగింది.పెద్ద ఎత్తున బడ్జెట్‌ తో ఈ సినిమా ను కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్నాడు.

 Prabhas Salaar Movie Release In Amazon Prime-సలార్‌ ను నెం.1 గా నిలబెట్టిన అమెజాన్‌ ప్రైమ్‌, ఆకాశమే హద్దుగా ప్రభాస్ క్రేజ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేజీఎఫ్‌ ను మించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.ప్రతి ఒక్క యాక్షన్‌ సన్నివేశం కూడా రోమాలు నిక్కబొడిచే విధంగా ఉంటాయంటూ మేకర్స్ చెబుతున్నారు.

ఇటీవలే సింగరేణి బొగ్గు గణిలో మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

త్వరలో సలార్‌ సెకండ్‌ షెడ్యూల్‌ ను మొదలు పెట్టబోతున్నారు.

ఈ సమయంలో అమెజాన్‌ ప్రైమ్‌ వారు ఈ సినిమా ను కొనుగోలు చేసేందుకు గాను చర్చలు జరుపుతున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కు దక్కని రేంజ్ లో సలార్‌ కు గాను అమెజాన్ ప్రైమ్‌ వారు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.

హాలీవుడ్ మూవీస్ మాత్రమే ఆ రేంజ్‌ లో సినిమా థియేట్రికల్‌ విడుదల తర్వాత మొత్తంను దక్కించుకుంటాయి.బాలీవుడ్‌ సినిమా లో ఏ ఒక్క సినిమా కూడా పొందని రేటును సలార్‌ దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.బాలీవుడ్‌ స్టార్ లు సూపర్‌ స్టార్‌ లు ఎంతో మంది ఉండగా సలార్‌ మూవీ రేటు ప్రభాస్‌ ను నెం.1 స్థానంలో నిలబెట్టిందంటూ టాక్‌ వినిపిస్తుంది.

#Amazon Prime #Second Schedule #Huge Rate #Prashanth Neel ##Salaar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు