యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
నీల్ కేజిఎఫ్ సిరీస్ తో భారీ హిట్స్ అందుకుని వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఇక మొన్నటి వరకు ఆగిపోయిన ఈ షూట్ ఇటీవలే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.
ఈ సినిమా ఫాస్ట్ గా షూట్ పూర్తి చేసుకున్న అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని నీల్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నాడు.అయితే ప్రభాస్ సినిమాలకు ఏమయ్యిందో తెలియదు కానీ ఈయన చేస్తున్న సినిమాలపై ఏదొక రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
ఇప్పటికే ఈయన నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ వాయిదా పడింది.సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా జూన్ లోకి వాయిదా వేయగా అసలు జూన్ లో కూడా రిలీజ్ కాదు.2024 లోనే రిలీజ్ అయ్యేది.అనే రూమర్స్ వస్తున్నాయి.
ఈ రూమర్స్ తోనే డార్లింగ్ ఫ్యాన్స్ తలలు పగిలి పోతుంటే.ఇక ఇప్పుడు సలార్ సినిమా మీద కూడా ఇలాంటి రూమర్స్ నే వస్తున్నాయి.ఎవరు ఎందుకు సృష్టిస్తున్నారో తెలియదు కానీ ఈ వార్తలకు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు.2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.కానీ ఈ టైం కు కూడా సలార్ రిలీజ్ కాదు అని 2024 లోనే సలార్ కూడా వచ్చేది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.దీనిపై మరోసారి టీమ్ క్లారిటీ ఇస్తే కానీ ఈ రూమర్స్ కు అడ్డు పడదు.ఇక ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.మరి ఈ సినిమా ఫాస్ట్ గా షూటింగ్ జరుగుతుంది కాబట్టి అనుకున్న సమయానికే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
