యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ‘‘సలార్”( Salaar movie ) ఒకటి.ఆదిపురుష్ వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇదైనా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు.మరి ఈ సినిమా మరో రెండు నెలల్లో రిలీజ్ కాబోతుంది.
ఈ క్రమంలోనే వరుసగా ప్రమోషన్స్ కోసం సిద్ధం అవుతున్నారు.ప్రభాస్ చేస్తున్న ‘సలార్’ మూవీ నుండి మొన్ననే టీజర్ వచ్చి ఎన్నో రికార్డులను తిరగరాసి ప్రభాస్ తన ఖాతాలో కొత్త రికార్డులను సైతం వేసుకున్నాడు.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ నుండి టీజర్ రిలీజ్ చేసిన మూడు రోజుల్లోనే ట్రైలర్ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు.

ఆగస్టులో ఈ ట్రైలర్ రిలీజ్ అవుతుంది మార్క్ చేసి పెట్టుకోండి అంటూ చెప్పిన వర్డ్స్ మరింత సెన్సేషన్ క్రియేట్ చేసాయి.ఈ ట్రైలర్ కోసం ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా సలార్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమా యూఎస్ డిస్టిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఒక అప్డేట్ ఇచ్చింది.
ఏంటంటే.
సలార్ ఉత్తర అమెరికా లోనే 1980 కి పైగానే లొకేషన్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రేంజ్ లో అత్యధిక లొకేషన్స్ లో రిలీజ్ కాలేదు.
దీంతో ఈ అరుదైన ఘనత అందుకుని సలార్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.సెప్టెంబర్ 27, 2023న ఈ సినిమా ప్రీమియర్ షో పడబోతోంది.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
చూడాలి ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో బాహుబలి రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో.