సాహో టీజర్‌ టాక్‌ టాలీవుడ్‌ సినిమాలా లేదు, అంతకు మించి  

Prabhas Sahoo Teaser Talk-

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ‘సాహో’ చిత్రం కోసం ఫ్యాన్స్‌ గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.సుజీత్‌ దర్శకత్వంలో సాహో చిత్రం అంటూ దాదాపు అయిదు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతోంది.రన్‌ రాజా రన్‌ చిత్రం విడుదలైనప్పటి నుండి కూడా ప్రభాస్‌ డేట్ల కోసం ఎదురు చూసిన సుజీత్‌ బాహుబలి పూర్తి అయిన తర్వాత ప్రభాస్‌ డేట్లు దక్కించుకున్నాడు...

Prabhas Sahoo Teaser Talk--Prabhas Sahoo Teaser Talk-

సుజీత్‌ ఒక్క చిత్రం అనుభవంతోనే సాహో చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్‌తో ఎలా తెరకెక్కిస్తాడని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు.అందరి అనుమానాలను పటాపంచలు చేసి అద్బుతమైన యాక్షన్‌ సీన్స్‌తో సినిమాను తెరకెక్కించినట్లుగా సాహో టీజర్‌ విడుదలైన తర్వాత వెళ్లడయ్యింది.బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌ను తీసుకున్న సుజీత్‌ సినిమాను బాలీవుడ్‌ స్థాయికి తీసుకు వెళ్లాడు.ఇక సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు చూస్తుంటే ఇది టాలీవుడ్‌ సినిమానేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Prabhas Sahoo Teaser Talk--Prabhas Sahoo Teaser Talk-

హాలీవుడ్‌ రేంజ్‌ యాక్షన్‌ సన్నివేశాలు, స్టంట్స్‌ ఇలా అన్ని సీన్స్‌ కలిపి ఇది టాలీవుడ్‌ మాత్రమే కాదు హాలీవుడ్‌ సినిమాలకు కూడా మించి అన్నట్లుగా ఉంది.అద్బుతమైన టేకింగ్‌తో పాటు విజువల్‌ వండర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని టీజర్‌ను చూస్తే అర్థం అయ్యింది.అందుకే ఈ చిత్రం రికార్డు స్థాయిలో బిజినెస్‌ చేయడం ఖాయం అయ్యింది.500 కోట్ల రూపాయల టార్గెట్‌తో ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది.ఆగస్టు 15న విడుదల కాబోతున్న చిత్రం మరెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.