‘సాహో’ సాహసం.. బూడిదలో పోసిన పన్నీరు!

‘బాహుబలి’తో తెలుగు సినిమా స్థాయి పెరిగింది.అంతకు ముందు వరకు 50 కోట్ల బడ్జెట్‌ అంటే బాబోయ్‌ అనే వారు, కాని ఇప్పుడు వందల కోట్లు బడ్జెట్‌ పెట్టి సినిమాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 Prabhas Sahoo Movie Sahasam-TeluguStop.com

సినిమాలో మ్యాటర్‌ ఉంటే ఎంత బడ్జెట్‌ అయినా రికవరీ చేస్తుందనే విషయం బాహుబలితో రుజువు అయ్యింది.అయితే అనాలోచితంగా ఎక్కువ బడ్జెట్‌ పెడితే కొన్ని సార్లు కష్టం అవుతుందనే విషయాన్ని కొందరు గుర్తించడం లేదు.

బాహుబలి సినిమా కోసం జక్కన్న ఒక అద్బుతాన్ని సృష్టించాడు కనుక అది ఆ రేంజ్‌లో కలెక్షన్స్‌ను వసూళ్లు చేసింది.అన్ని సినిమాలు కూడా అదే స్థాయిలో వసూళ్లు సాధిస్తాయనే నమ్మకం లేదు.

స్టార్‌డం మరియు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని చిత్ర బడ్జెట్‌ను కేటాయించుకోవాల్సి ఉంటుంది.కాని ‘సాహో’ చిత్రానికి అవేవి ఆలోచించకుండా బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.కొత్త దర్శకుడు సుజీత్‌ను నమ్మి యూవీ క్రియేషన్స్‌ వారు ఏకంగా 250 కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇటీవలే ఒక ఖరీదైన యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించాడు.రెండు నెలల పాటు చిత్రీకరించిన ఆ యాక్షన్‌ సీన్స్‌కు ఏకంగా 90 కోట్లను ఖర్చు చేసినట్లుగా స్వయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఎంత భారీ సినిమా అయితే మాత్రం ఒక యాక్షన్‌ సీన్‌కు అంతగా ఖర్చు చేయడం ఏంటని బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

‘బాహుబలి’ క్రేజ్‌తో సాహో చిత్రం నడుస్తుందని యూవీ క్రియేషన్స్‌ వారు ఇంత బడ్జెట్‌ను పెడుతుండవచ్చు.అయితే సినిమా ఫలితం కాస్త అటు ఇటుగా అయితే స్టార్‌డం లేని కారణంగా సినిమా కనీసం 50 కోట్లు కూడా వసూళ్లు చేసే అవకాశం లేదు.

అదే జరిగితే పడ్డ కష్టం, పెట్టిన ఖర్చు అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.బాహుబలి ఫుల్‌ క్రెడిట్‌ ప్రభాస్‌ది కాదనే విషయం అందరు ఒప్పుకుంటారు.

ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్‌పై నమ్మకంతో ఇంత భారీగా ఖర్చు చేయడం అనాలోచిత నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాహుబలిని మించిన బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

జక్కన్న రాజమౌళి సినిమాకు ఎంత మేరకు అవసరమో అంత మేరకు మాత్రమే ఖర్చు చేస్తాడు.ఎట్టి పరిస్థితుల్లో కూడా గొప్పలకు పోకుండా చిత్రాన్ని చేస్తాడు.

కాని ప్రస్తుతం ‘సాహో’ చిత్రం కోసం భారీ యాక్షన్‌ సీన్‌ అంటూ ఏకంగా 90 కోట్లు ఖర్చు చేయడం అవివేకం అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

సినిమా రిచ్‌గా కనిపించేందుకు కొన్ని సీన్స్‌కు ఎక్కువ ఖర్చు చేస్తే ప్రేక్షకులు థ్రిల్‌ ఫీల్‌ అవుతారు.

నిజమే కాని, అది శృతి మించితే మాత్రం మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని నిర్మాతలు గుర్తించకుంటే పరిస్థితి తారు మారు అయ్యే అవకాశం ఉంది.బాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా అక్కడ కూడా భారీగా విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎన్ని చోట్ల విడుదలైనా కూడా సినిమా టాక్‌ నెగటివ్‌ అయితే పెట్టిన పెట్టుబడిలో 25 శాతం కూడా వసూళ్లు వచ్చే అవకాశం లేదని ట్రేడ్‌ పండితులు విశ్లేషిస్తున్నారు.అందుకే నిర్మాతలు కాస్త జాగ్రత్త పడటం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube