'సాహో' సినిమా టీఆర్పీ రేటింగ్ అంత తక్కువా..?

కొన్ని సినిమాలు సినిమా విడుదలకు ముందే టీజర్లు, ట్రైలర్ల ద్వారా అంచనాలు పెంచేస్తాయి.ఆ అంచనాలను సినిమా అందుకుంటే ప్రేక్షకులు సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు.

 Prabhas Saaho Movie Gets Low Trp Ratings, Saaho Movie, Prabhas, Sujeeth, Zee Tel-TeluguStop.com

సినిమా అంచనాలను అందుకోలేక పోతే మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని పొందక తప్పదు.అలా ప్రభాస్ కెరీర్ లో భారీ అంచనాలతో తెరకెక్కి డిజాస్టర్ గా నిలిచిన సినిమా సాహో.బాహుబలి, బాహుబలి 2 లాంటి ఇండస్ట్రీ హిట్ల తర్వాత సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సాహో సినిమా తెరకెక్కింది.

150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా హిందీలో మాత్రం హిట్తైంది.తెలుగులో వెండితెరపై డిజాస్టర్ అయిన సాహో సినిమా బుల్లితెరపై కూడా అదే ఫలితాన్ని అందుకోవడం గమనార్హం.కొన్ని రోజుల క్రితం జీ తెలుగు ఛానల్ లో సాహో సినిమా తొలిసారి ప్రసారమైంది.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు వెండితెరపై ఎలాంటి ఫలితాన్ని అందుకున్నా బుల్లితెరపై మంచి టీఆర్పీ రేటింగ్ సాధిస్తాయి.

అయితే అందుకు భిన్నంగా సాహో సినిమాకు కేవలం 5.8 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.చాలామంది ప్రభాస్ కెరీర్ లో ఈ టీఆర్పీ రేటింగ్ చెత్త రికార్డు అని అభిప్రాయపడుతున్నారు.

భవిష్యత్తులో ప్రభాస్ సినిమాల శాటిలైట్ రైట్స్ పై ఈ టీఆర్పీ రేటింగ్ ప్రభావం పడే అవకాశం ఉంది.కొన్ని సినిమాలు రిపీట్ టెలీకాస్ట్ లో సైతం ఇంతకంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

అయితే సాహో సినిమా ప్రసారమైన సమయంలోనే ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన గుణ 369 సినిమా ప్రసారమైంది.అయితే ఆ సినిమా 5.9 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది.ఒకేరోజు ప్రసారమైనా ప్రభాస్ సినిమా కంటే కార్తికేయ సినిమానే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube