స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) మీడియా ముందుకు వచ్చి చాలాకాలం అయింది.సలార్ సినిమా( Salaar movie) ప్రమోషన్స్ కు సైతం ప్రభాస్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ప్రభాస్ 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొంతూరు కోసం రోడ్డు వేయించడంతో పాటు త్రాగునీరు, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఒక ఊరూపేరు లేని యూట్యూబ్ ఛానల్ ప్రచారంలోకి తెచ్చిన ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

సొంతూరు కోసం ప్రభాస్ కొంతమేర సహాయం చేయవచ్చు కానీ వాస్తవంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితులు అయితే ఉండవు.ఇలాంటి కార్యక్రమాలను ప్రభాస్ నిర్వహిస్తే అధికారికంగా ప్రభాస్ లేదా ఆయన సన్నిహితుల నుంచి కచ్చితంగా ప్రకటన వస్తుంది.అప్పటివరకు వైరల్ అవుతున్న వార్తలను నమ్మాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.స్టార్ హీరో ప్రభాస్ నుంచి స్పందన వచ్చే వరకు ఈ వార్తలను నమ్మాల్సిన అవసరం లేదు.
మరోవైపు ప్రభాస్ సినిమాలు వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ ఫ్యాన్స్ కు షాకిస్తున్నాయి. కల్కి సినిమా( Kalki 2898 movie) వాయిదా పడటం లాంఛనమే అని ఎలాంటి సందేహం అక్కర్లేదని నెట్టింట కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే కల్కి మేకర్స్ ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.

రిలీజ్ డేట్ మారకపోతే ఏపీ ఎన్నికల ప్రభావం ఈ సినిమాపై కచ్చితంగా పడుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఏపీ ఎన్నికల వల్ల ప్రభాస్ సినిమాల షెడ్యూల్స్ అన్నీ మారిపోయాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
స్టార్ హీరో ప్రభాస్ తన భవిష్యత్తు సినిమాల ప్రమోషన్స్ లో అయినా పాల్గొంటారా? లేదా? అనే ప్రశ్న వినిపిస్తుండగా ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.