పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మళ్ళీ ముఖానికి రంగు వేసుకున్నాడు.చాలా రోజుల తర్వాత ఈయన కెమెరా ముందుకు వచ్చాడు.
ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నాడు.
ఇందులో ఆదిపురుష్ సినిమా షూట్ పూర్తి చేసుకుంది.ఇక ఇప్పుడు సలార్ తో పాటు ప్రాజెక్ట్ కే షూటింగులతో బిజీగా ఉన్నాడు.
అయితే ఇటీవలే ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు గారు మరణంతో ఈయన షూటింగులకు బ్రేక్ ఇచ్చాడు.దీంతో అన్ని సినిమాల షూట్ ఆగిపోయింది.అంతా బాగుండి ఉంటే గత వారమే సలార్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యి ఉండేది.అందుకు రామోజీ ఫిలిం సిటీలో 12 రకాల సెట్స్ కూడా వేసి రెడీగా ఉంచారట.
కానీ కృష్ణం రాజు హటాత్తు మరణంతో ఈ సినిమా షూట్ కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే బుధవారం ఈయన మరణించి 11 డేస్ పూర్తి అయ్యిందట.తన కోసం అంత ఖర్చు పెట్టి ఎదురు చూస్తున్న వారికి ఇబ్బంది కలగకుండా సలార్ సెట్ లో ప్రభాస్ గురువారం అడుగు పెట్టినట్టు తెలుస్తుంది.
సలార్ కోసం వేసిన 12 సెట్ లలో ఒక్కో సెట్ లో మూడు నాలుగు రోజులు మాత్రమే షూట్ ఉంటుందట.
అందుకే ప్రభాస్ ఈ సెట్ లో అడుగు పెట్టినట్టు తెలుస్తుంది.సలార్ టీమ్ కూడా మరో వారం తర్వాత ప్రభాస్ వస్తాడని భావించారట.అందుకే ఆయన సెట్ లో అడుగు పెట్టగానే అంత సర్ప్రైజ్ అయ్యారని తెలుస్తుంది.
ఈ షెడ్యూల్ లో శృతి హాసన్ కూడా పాల్గొనగా కీలక సన్నివేశాలను డైరెక్టర్ తెరకెక్కించ నున్నట్టు తెలుస్తుంది.ఇదే షెడ్యూల్ ఈ నెల చివరి వరకు జరగనుందని సమాచారం.ఇక కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.