రెబల్ దెబ్బకు యూట్యూబ్ రికార్డులు హడల్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఎలాంటి క్రేజ్ మరియు ఫాలోయింగ్ సాధించుకున్నాడో అందరికీ తెలిసిందే.ఒక్క సినిమాతో నేషనల్ హీరోగా మారిన ప్రభాస్, ఆ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు.

 Prabhas Rebel Movie Action Record On Prabhas, Rebel, Youtube, Action Scene, Ragh-TeluguStop.com

ఇక ఆ తరువాత సాహో చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

కాగా ఇప్పుడు తన 20వ చిత్రంతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇక గతంలో ప్రభాస్ నటించిన రెబల్ సినిమా ఎలాంటి దారుణమైన ఫలితాన్ని దక్కించుకుందో అందరికీ తెలిసిందే.

రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సినిమా ఘోన పరాజయాన్ని చవిచూసింది.అయితే ఈ సినిమాకు యూట్యూబ్‌‌లో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్‌కు యూట్యూబ్‌లో ఎక్కడలేని క్రేజ్ వచ్చి పడింది.ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రావడం నిజంగా విశేషం అని చెప్పాలి.

ఒక సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌కు ఇంతటి భారీ మొత్తంలో రెస్పాన్స్ రావడం నిజంగా అరుదని ప్రేక్షకులు అంటున్నారు.ఏదేమైనా ఇలాంటి రికార్డులు కొట్టాలంటే ప్రభాస్ తరువాతే ఎవరైనా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube