'రాధే శ్యామ్‌' రిలీజ్ డేట్ మార్పు లేదు, ఓటీటీ విడుదల కాని...!

ప్రభాస్‌ రాధే శ్యామ్‌ సినిమా విడుదల గత ఏడాది కాలంగా వాయిదా పడుతూనే ఉంది.కరోనా కారనంగా ఈ సారి లాంగ్ గ్యాప్‌ వచ్చింది.

 Prabhas Radhesyam Movie May Be Release In Direct Ott Like Pay For View , Pooja H-TeluguStop.com

విడుదల విషయంలో రాధే శ్యామ్‌ మేకర్స్ ఈసారి చాలా సీరియస్ గా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా అనుకున్నట్లుగా ఈ సినిమా ను జులై 30 తారీకున విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే సినిమా ను థియేటర్లలో విడుదల చేయడంతో పాటు నేరుగా ఓటీటీ లో కూడా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మే నెలలో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వబోతుంది.

జూన్‌ మరియు జులై నెలలో ఈ సినిమా కు సంబంధించిన ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేస్తారు.కనుక కరోనా సెకండ్‌ వేవ్‌ ఉన్నా లేకున్నా ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా సినిమా ను థియేటర్ల వద్దకు తీసుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

సల్మాన్‌ ఖాన్ కొత్త సినిమా ను థియేటర్లలో విడుదల చేయడంతో పాటు ఓటీటీ ద్వారా పే పర్‌ వ్యూ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించారు.ఆ నిర్ణయంకు మంచి స్పందన వస్తుంది.

థియేటర్లలో చూడాలని ఆశించిన వారు థియేటర్‌ కు వెళ్ల వచ్చు.లేదు అని భయపడుతూ ఇంట్లో ఉండే వారు ఓటీటీ లో పే పర్‌ వ్యూ పద్దతిన చూడవచ్చు.

సల్మాన్ ఖాన్‌ సినిమా కు చేసిన ప్లాన్‌ ను ప్రభాస్ సినిమా కు యూవీ క్రియేషన్‌ వారు ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. థియేటర్ల తో పాటు ఒకే సారి ఓటీటీ లో విడుదల చేయడం అంటే థియేటర్ల విషయంలో ఆందోళన చెందాల్సిన విషయమే.

భారీ మొత్తంలో డబ్బు చెల్లించి థియేటర్లలో చూడలేని వారు ఇలా ఓటీటీ లో చూడాలని కోరుకుంటున్నారు.కనుక థియేటర్లలో కంటే రాధే శ్యామ్‌ ను ఓటీటీ లో విడుదల చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

పే పర్ వ్యూ పద్దతి లో ఇప్పటికే హాలీవుడ్‌ సినిమా లు వస్తున్నాయి.కనుక ఈ సినిమా కూడా తప్పకుండా వచ్చి ఆకట్టుకుంటుందేమో చూడాలి.

అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube