ప్రభాస్ ఫ్యాన్స్ లో చిన్న అసంతృప్తి.. మళ్లీ ఇదేంటీ రాధా?

ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్‌ రూపొందుతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.

 Prabhas Radheshyam Movie Teaser Update,valientinse Day,glince, Latetst  Tollywoo-TeluguStop.com

భారీ స్థాయిలో వసూళ్లను దక్కించుకున్న సాహో తర్వాత ఈ సినిమాను ప్రభాస్‌ మొదలు పెట్టాడు.అనేక కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చేసింది కనుక టీజర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్‌ ను కాకుండా ఫస్ట్‌ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా టీజర్‌ ను వ్యాలెంటైన్‌ డే సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.అయితే యూవీ క్రియేషన్స్‌ వారు మాత్రం టీజర్‌ ను కాకుండా గ్లిమ్స్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే చాలా వీడియోలు వస్తాయి తెస్తాము అంటూ చెప్పారు.కాని నిరాశ పర్చారు.మరోసారి ఇది ఈ సినిమా పై అంచనాలు తగ్గించేలా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమా టీజర్ కోసం వెయిట్‌ చేస్తున్న వారికి మళ్లీ ఈ నిరాశ ఏంటీ అంటూ అభిమానులు అసహనంతో యూవీ క్రియేషన్స్ వారిపై విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభాస్‌ అభిమానులు రాధేశ్యామ్‌ సినిమా టీజర్‌ కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు కొందరు ఆ గ్లింప్స్ ను టీజర్ గా ప్రచారం చేస్తున్నారు.

అయినా కూడా అభిమానులు కొందరు అసంతృప్తితోనే ఉన్నారు.ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తుండగా కృష్ణం రాజు కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా ను జులై లో విడుదల చేస్తామని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube