బాలీవుడ్ పాటలకు దక్కని రికార్డ్‌ 'రాధేశ్యామ్‌' పాటకు దక్కింది

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ  దర్శకత్వంలో రూపొందిన రాధే శ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.

 Prabhas Radheshyam Movie Hindi Song Release Date , Flim News, Movie News, Prabha-TeluguStop.com

సౌత్‌ మరియు హిందీలో వేరు వేరుగా పాటలను విడుదల చేస్తున్నారు.ఇప్పటికే రెండు వర్షన్‌ ల మ్యూజిక్ ను రెడీ చేయించారనే వార్తలు వచ్చాయి.

ఆ వార్తలు నిజమే అన్నట్లుగా ప్రభాస్‌ రాధే శ్యామ్‌ మొదటి పాట సౌత్ లో కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు.ఇప్పుడు హిందీలో ఆషికి ఆగయీ అంటూ పాటను విడుదల చేయడం జరిగింది.

భారీ స్థాయిలో ఈ పాటకు హైప్ వచ్చింది.దాంతో అత్యధిక వ్యూస్ ను ఈ పాట దక్కించుకుంది.

ఇప్పటి వరకు బాలీవుడ్‌ లో విడుదల అయిన ఏ పాటకు కూడా దక్కని అనూహ్యమైన రెస్పాన్స్ ఈ పాటకు దక్కింది.

Telugu Prabhas, Radheshyam-Movie

కేవలం 15 నిమిషాల్లో ఈ పాట ఏకంగా 1000 కే లైక్స్ ను దక్కించుకుంది.ఇంత తక్కువ సమయంలో లక్ష లైక్స్ ను దక్కించుకున్న పాటగా ఇది రికార్డు సాధించింది.సౌత్ లో ఈ రికార్డులు కామన్‌ కాని హిందీలో మాత్రం ఇది ఖచ్చితంగా అరుదైన పెద్ద రికార్డు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

బాలీవుడ్‌ లో ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చాలా వచ్చాయి.ఆ సినిమాల పాటలు భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా మాత్రమే ఇలా పాటల విషయంలో రికార్డును దక్కించుకుంది.

ప్రతి ఒక్క ఇండియన్ సినీ అభిమాని ఈ సినిమా కోసం పాటల కోసం ఎదురు చూస్తున్నారు అని దీంతో వెళ్లడయ్యింది. రాధే శ్యామ్‌ తో ప్రభాస్ 500 ల కోట్ల క్లబ్ లో మరోసారి చేరుతాడనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను యూవీ వారు నిర్మించిన విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube