ప్రభాస్ పై అభిమానులకు ఇంట్రెస్ట్ తగ్గిందా.. అందుకే యూట్యూబ్ వ్యూస్ తగ్గాయా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రాదే శ్యామ్”.యూరప్ లో జరిగే ఒక పిరియాడిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది.

 Prabhas Radhe Shyam Views Count Dropped And Youtube Clarity On Issue, Prabhas, T-TeluguStop.com

ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించగా పూజా హెగ్డే మాత్రం ప్రేరణ అనే పాత్రలో కనిపించనున్నారు.ఈక్రమంలోనే సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసారు.

గత రెండు సంవత్సరాల నుంచి ప్రభాస్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ టీజర్ విడుదల చేయడంతో పండగ చేసుకున్నారు.

అయితే ప్రభాస్ సినిమా నుంచి టీజర్ విడుదల కావడంతో వ్యూస్ పరంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు నిర్వాహకులు.అయితే ఈ టీజర్ వ్యూస్ ఉన్నఫలంగా తగ్గడంతో ప్రభాస్ అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ పై అభిమానం తగ్గిందా… అందుకే వ్యూస్ తగ్గాయా అంటూ అనుమానాలను వ్యక్తం చేశారు.ఒకేసారి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ తగ్గిపోవడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు.

Telugu Prabhas, Radhe Shyam, Tollywood, Youtubecount-Movie

ఈ క్రమంలోనే ప్రభాస్ విషయంలో ఇలా జరగడంతో అభిమానులు ఏకంగా యూట్యూబ్ టీమ్ ను అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అంటూ ప్రశ్నించారు.ఈ క్రమంలోని యూట్యూబ్ నిర్వాహకులు స్పందిస్తూ… యూట్యూబ్ ను వ్యాలీడేట్ చేశామని, ఈ క్రమంలోనే ఏదైనా వీడియోల పై అప్పటివరకు ఉన్న వ్యూస్ తగ్గడం, లేదా ఉన్న వ్యూస్ ఫ్రీజ్ కావడం జరుగుతుందని నిర్వాహకులు సమాధానం చెప్పడంతో అభిమానులు కాస్త శాంతించారు.ఇక ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కావడంతో అంచనాలు పెట్టుకొని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube