'రీషూట్' కు రెడీ అయిన ప్రభాస్ రాధే శ్యామ్..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాధే శ్యామ్.ఈ సినిమా కరోనా కారణంగా ఎప్పటి నుండో షూటింగ్ వాయిదా పడుతున్న నేపథ్యంలో రిలీజ్ కూడా ఆలస్యం అవుతూ వస్తుంది.

 Prabhas Radhe Shyam Movie Reshoot-TeluguStop.com

రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక గాసిప్ అభిమానులను ఉలిక్కి పడేలా చేస్తుంది.

ఈ సినిమాను మళ్ళీ రీషూట్ చేయబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే ఇలా రీ షూట్ చేయడం అనేది కొత్త ఏమీ కాదు చాలా సినిమాలకు ఇలా రీ షూట్ చేస్తూనే ఉంటారు.

 Prabhas Radhe Shyam Movie Reshoot-రీషూట్’ కు రెడీ అయిన ప్రభాస్ రాధే శ్యామ్..-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొంతమందికి సినిమా షూటింగ్ పూర్తి అయినా తర్వాత సీన్లు బాగా రాలేదని ఫీల్ అవుతుంటారు.అలంటి వారు ఆ సీన్లను మళ్ళీ రీ షూట్ చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ విషయంలో కూడా అదే జరుగుతుంది.ఈ సినిమాలో కొన్ని సీన్లు ప్రభాస్ కు అంత బాగా రాలేదని అనిపించడంతో మళ్ళీ రీ షూట్ చేయాలనీ డైరెక్టర్ ను కోరడంతో ఆ సీన్లను మళ్ళీ తెరకెక్కించబోతున్నారని సమాచారం.

అదే జరిగితే ఈ సినిమా మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా ప్రమోషన్స్ సరిగ్గా చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా మళ్ళీ విడుదల తేదీ వాయిదా పడితే ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తారు.ఇది ఇలా ఉండగా రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

యువీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా జులై 30 న విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించారు.

చూడాలి మరి రీ షూట్ కారణంగా సినిమా వాయిదా పడుతుందో లేదో.

#Reshoot #Prabhas #Radhe Shyam #RadheShyam #PrabhasRadhe

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు