రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

సాహో సినిమా తర్వాత చాలా రోజుల గ్యాప్ తీసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

 Young Rebel Star Prabhas Radhe Shyam Movie First Look Poster, Radhe Shyam, Vikra-TeluguStop.com

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ సినిమా కరోనా వైరస్ కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన షూటింగ్ ఈ మధ్యనే మళ్ళీ ఇటలీలో షూటింగ్ ను మొదలుపెట్టారు.అంతేకాదు మరికొన్ని రోజులు ఇంకా షూటింగ్ అక్కడ జరగబోతోంది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో హీరో ప్రభాస్ విక్రమాదిత్యగా నటిస్తున్నట్లు పోస్టర్ లో చెప్పగనే చెప్పేసారు.ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ పూజ హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆవిడ గురించి ఓ పోస్టర్ వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

ఆ సినిమాలో పూజా హెగ్డే ప్రేరణగా నటించబోతోంది.మొత్తానికి ఈ సినిమా స్టోరీ వింటేజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిస్తున్నారు.ఇకపోతే మొత్తంగా ఈ సినిమా పూర్వజన్మల నేపథ్యంలో లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్ ను యు.

వి క్రియేషన్స్ వారు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

రెండు రోజుల్లో ప్రభాస్ పుట్టిన రోజు ఉండగా అందుకు ముందుగానే రాధేశ్యామ్ నుండి విక్రమాదిత్య గా ప్రభాస్ లుక్ ను విడుదల చేయడం నిజంగా గమనార్హం.ఈ సినిమాను 2021లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమాను తెలుగుతోపాటు మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో ఒకేసారి తెరకెక్కించనున్నారు.ఇక ఈ సినిమా తర్వాత హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్, ఓం రౌత్, అలాగే ప్రశాంత్ నీల్ దర్శకులతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ప్రభాస్.

ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అఫీషియల్ గా ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రకటన విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube