ప్రభాస్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదేనట!  

Prabhas Radhakrishna - Telugu Pooja Hegde, Prabhas, Prabhas 20, Radhakrishna, Radhe Shyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తరువాత తన నెక్ట్స్ మూవీని జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కి్స్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుండగా జార్జియాలో షూటింగ్ జరుపుకుని వచ్చి లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ను వాయిదా వేసుకుంది.

 Prabhas Radhakrishna

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ ముగియగానే ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ప్రభాస్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదేనట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టే సమయంలో చిత్ర టైటిల్‌ను అనౌన్స్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.ఈ సినిమాకు ‘రాధే శ్యాం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు, దీనికి సంబంధించిన పోస్టర్ వర్క్ కూడా పూర్తయినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి ప్రభాస్ సినిమాకు సంబంధించిన ట్రీట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ వైవిధ్యమైన గెటప్‌లో కనిపిస్తాడని, ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుందని చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది.

ఇక ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.మరి ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Radhakrishna Related Telugu News,Photos/Pics,Images..

footer-test