హ్యాపీవెడ్డింగ్‌తో ప్రభాస్‌కు లింక్‌ ఏంటీ?     2018-06-30   23:21:11  IST  Raghu V

మెగా డాటర్‌ నిహారిక హీరోయిన్‌గా తెరకెక్కుతున్న రెండవ చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్‌’. ఈ చిత్రంలో క్యూట్‌ బాయ్‌ సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరపడగంతో పాటు, మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరుపుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంతో ప్రభాస్‌కు సంబంధం ఉందని, ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కిందనే ప్రచారం సినీ వర్గాల్లో జరుగుతుంది. ప్రభాస్‌ కెరీర్‌కు పునాది వేసిన నిర్మాత ఎంఎస్‌ రాజు తనయుడిని హీరోగా నిలిపేందుకు ప్రభాస్‌ ఈ చిత్రంను తన స్నేహితులతో నిర్మింపజేస్తున్నాడు.

ప్రభాస్‌కు హోం బ్యానర్‌ అయిన యూవీ క్రియేషన్స్‌లో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. నిహారిక మరియు సుమంత్‌ అశ్విన్‌ల కాంబో అనగానే అందరి దృష్టి ఉంది. ఈ చిత్రంతో సుమంత్‌ అశ్విన్‌ కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకుంటే ప్రభాస్‌ తనకు లైఫ్‌ ఇచ్చిన నిర్మాత రుణం తీర్చుకున్న వాడు అవుతాడు. అందుకే ప్రభాస్‌ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రభాస్‌ ప్రస్తుతం సాహో చిత్రం కోసం కష్టపడుతున్నాడు. అయినా కూడా ‘హ్యాపీ వెడ్డింగ్‌’ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.