ప్రాజెక్ట్ కె కోసం డేట్స్ ఇచ్చిన ప్రభాస్.. షూటింగ్ ఎప్పుడంటే ?

బాహుబలి స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలు చేస్తూ ఎవ్వరికి అందనంత ఎత్తుకు చేరుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

 Prabhas Project K Movie Latest Update,prabhas, Nag Aswin, Radheshyam, Adipurush,-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Telugu Salaar, Adipurush, Nag Aswin, Prabhas, Prabhasproject, Project, Radheshya

ఈ సినిమా షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.ఈ షెడ్యూల్ కూడా పూర్తి చేసిన తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్టు సమాచారం.ఈ సినిమా అన్ని సినిమాలు కంటే ముందే ప్రకటించిన ప్రభాస్ ఇంత వరకు షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు.

Telugu Salaar, Adipurush, Nag Aswin, Prabhas, Prabhasproject, Project, Radheshya

ఇప్పటికే నాగ్ అశ్విన్ ఫస్ట్ షెడ్యూల్ ను ప్రభాస్ లేకుండానే అమితాబ్ బచ్చన్ తో కలిసి పూర్తి చేసాడు.తర్వాత షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరు చర్చించు కుంటున్నారు.అయితే తాజాగా వస్తున్నా సమాచారం ప్రకారం ప్రభాస్ ప్రాజెక్ట్ కే కోసం డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.యూనిట్ సభ్యులు చెబుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ అక్టోబర్ నుండి షూటింగ్ లో జాయిన్ అవుతాడట.

ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొనబోతున్నట్టు టాక్.అక్టోబర్ మొత్తం ఈ సినిమా షూటింగ్ లోనే ప్రభాస్ ఉండబోతున్నాడట.

అంతేకాదు ఈ షెడ్యూల్ లో అమితాబ్ దీపికా మధ్య వచ్చే సన్నివేశాలు కూడా తెరకెక్కించ బోతున్నట్టు సమాచారం.అమితాబ్ బచ్చన్ డేట్స్ తక్కువుగా ఉన్నాయి కాబట్టి ముందు ఆయన సన్నివేశాలను పూర్తి చేయాలనీ అనుకుంటున్నారట.

Telugu Salaar, Adipurush, Nag Aswin, Prabhas, Prabhasproject, Project, Radheshya

ఈ సినిమాను అశ్వనీ దత్ భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ప్రభాస్ ఈ సినిమాతో గ్లోబల్ వైస్ పేరు తెచుకోబోతున్నాడు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అద్భుతమైన కథలో ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించ బోతున్నాడు.మరి చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డ్ లు బద్దలు కొడుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube