ప్రభాస్ సినిమాలో బ్రహ్మి కామెడీ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాకు రీసెంట్ గా ముహుర్త కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

 Prabhas Project K Brahmanandam Comedy Update-TeluguStop.com

ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.

సినిమా ఓపెనింగ్ కు అమితాబ్ కూడా అటెండ్ అవడం విశేషం.ఈ సినిమాకు ప్రాజెక్ట్ కె అని వర్కింగ్ టైటిల్ పెట్టారు.

 Prabhas Project K Brahmanandam Comedy Update-ప్రభాస్ సినిమాలో బ్రహ్మి కామెడీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్నా కామెడీకి ఇంపార్టెన్స్ ఉంటుందట అందుకే కామెడీ కింగ్ బ్రహ్మానందం ను ఈ సినిమాలో తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో బ్రహ్మానందం కోసం ఫుల్ లెంగ్త్ రోల్ రాశారట.హీరోతో ఈక్వల్ గా ఈ రోల్ ఉంటుందని చెబుతున్నారు.హాలీవుడ్ రేంజ్ సినిమాలో బ్రహ్మి కామెడీ కూడా స్పెషల్ అడ్వాంటేజ్ కానుందని తెలుస్తుంది.ఈ సినిమాలో ఇంకా చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని చెబుతున్నారు.

 సలార్, ఆదిపురుష్ పూర్తి చేశాక ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

#Project K #Update #Nag Ashwin #Prabhas #Brahmanandam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు