ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' 90 శాతం షూటింగ్ అక్కడే అట..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న భారీ సినిమా ప్రాజెక్ట్ కె (వర్కింగ్ టైటిల్).వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.

 Prabhas Project K 90 Percent Shooting In Romoji Film City Only-TeluguStop.com

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది.సినిమాను హాలీవుడ్ లెవల్ లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా వాడుతారని తెలుస్తుంది.అందుకే సినిమాలో సగం బడ్జెట్ వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కే పెట్టేస్తున్నారట.

 Prabhas Project K 90 Percent Shooting In Romoji Film City Only-ప్రభాస్ ప్రాజెక్ట్ K’ 90 శాతం షూటింగ్ అక్కడే అట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Amitabh Bacchan, Aswanidatt, Deepika Padukone, Latest News Movies, Nag Aswin, Prabhas, Project K, Romoji Film City, Tollywood-Movie

ఇక సినిమా షూటింగ్ 90 శాతం రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతుందని.అంతేకాదు షూటింగ్ ఎక్కువ శాతం ఇండోర్ స్టూడియోలోనే జరుగుతుందని తెలుస్తుంది.సినిమాలో మరో హీరోయిన్ గా సమంత కూడా నటిస్తుందని అంటున్నారు.అంతేకాదు మళయాళ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ కూడా నటిస్తాడని టాక్.మొత్తానికి ప్రాజెక్ట్ కె అంచనాలను మించి ఉండేలా డైరక్టర్ నాగ్ అశ్విన్ అదిరిపోయే ప్లాన్స్ వేస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు.ప్రాజెక్ట్ కె కోసం ప్రభాస్ 200 రోజుల దాకా డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

అంతలోగా తన పోర్షన్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట.  సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె మూడు సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీ షెడ్యూల్ తో ఉన్నాడు.

#Aswanidatt #Project #Amitabh Bacchan #Nag Aswin #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు