ఏపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన ప్రభాస్‌ నిర్మాత

తెలుగులో టాప్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న అశ్వినీదత్ ఈ మధ్య కాలంలో మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు.మహా నటి సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్న ఆయన ప్రస్తుతం ప్రభాస్ తో ఒక సినిమాను నిర్మించేందుకు ఇప్పటికే రెడీ అవుతున్నట్లు ప్రకటించారు.

 Producer Ashwini Dutt Case Against Ap Govt, High Court, Land Issue, Gannavaram A-TeluguStop.com

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అశ్వినీదత్ మరోసారి ఆ సినిమాతో టాలీవుడ్ టాప్ నిర్మాతగా మారడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.ఈ సమయంలో ఆయన ఏపీ ప్రభుత్వం కు వ్యతిరేకంగా ఆ హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

కొన్నాళ్ళ క్రితం అశ్వినీదత్ తనకు ఉన్న సుమారు 40 ఎకరాల భూమిని గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం ప్రభుత్వం కు ఇచ్చారు.ఆ సమయంలో రాజధాని అమరావతిలో ఆయనకు భూమిని కేటాయిస్తున్నట్లు గా ప్రభుత్వం ప్రకటించింది.

అయితే అమరావతి నుండి రాజధానిని తరలిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు కేటాయించిన భూమికి విలువ లేకుండా పోయింది.ఆ కారణంగా తాను ఇచ్చిన 40 ఎకరాల భూమిని తనకే కేటాయించాలని గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు నిలిపి వేయాలంటూ హైకోర్టు ను ఆశ్రయించారు.

ఇప్పటికే తన నుండి సేకరించిన కారణంగా దానికి 4 రెట్లు పరిహారం ఇవ్వాలి లేదంటే తన భూమిని తనకైనా ఇవ్వాలంటున్నాడు.లేదంటే మార్కెట్ రేటు ప్రకారం ఆ భూమికి 210 కోట్ల రూపాయలను తనకు ఇవ్వాలంటూ అశ్వినీదత్ హైకోర్టును ఆశ్రయించారు.

ప్రభుత్వం ఈ పిటిషన్ పై ఎలా స్పందిస్తుంది, కోర్టు దీనిని ఎలా విచారిస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ పరిణామాలు ప్రభాస్‌ సినిమాపై ఏమైనా పడే అవకాశం ఉందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube