రాధేశ్యామ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ సోదరి  

Prabhas Sister Praseedha Entry With Radhe Shyam, Prabhas, Praseedha, Krishnam Raju, Radhe Shyam, Tollywood News - Telugu Krishnam Raju, Prabhas, Praseedha, Radhe Shyam, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.ఇక ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.

 Prabhas Praseedha Krishnam Raju Radhe Shyam

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసి మరోసారి ప్రభాస్ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పరిశీలిస్తే ఓ కొత్త పేరు మనకు కనిపిస్తుంది.

రాధేశ్యామ్ తెలుగు పోస్టర్‌లో ప్రసీధ అనే పేరు ఉంది.ఇంతకీ ఈ ప్రసీధ ఎవరు అనే ప్రశ్న అందరిలో కలుగుతోంది.ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు కుమార్తెనే ఈ ప్రసీధ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.రాధేశ్యామ్ చిత్రాన్ని గోపీకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రసీధ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మాతల్లో ఒకరుగా ఎంట్రీ ఇస్తోంది.

రాధేశ్యామ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ సోదరి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గతంలోనూ ప్రభాస్‌కు చెందని కొన్ని ఈవెంట్స్‌ను ఆమె చూసుకునేది.ఇప్పుడు ఇలా పోస్టర్‌పై ఆమె పేరు రావడంతో టాలీవుడ్‌లో నిర్మాతగా మారేందుకు ఆమె రెడీ అయ్యిందనే విషయం అర్థమవుతోంది.

మొత్తానికి రాధేశ్యామ్ చిత్రంతో నిర్మాతగా మారుతున్న ప్రభాస్ సోదరి, ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియా వైడ్ సక్సెస్‌ను అందుకునేందుకు ప్రభాస్ అండ్ టీమ్ సిద్ధమయ్యారు.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.రాధేశ్యామ్ చిత్రంతో ప్రసీధ నిర్మాతగా సక్సెస్‌ఫుల్ ఎంట్రీ ఇవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

#Radhe Shyam #Prabhas #Krishnam Raju #Praseedha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Praseedha Krishnam Raju Radhe Shyam Related Telugu News,Photos/Pics,Images..