సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రాధేశ్యామ్  

Radhe Shyam Sets New Record, Radhe Shyam, Prabhas, Pooja Hegde, Radha Krishna, Tollywood News - Telugu Pooja Hegde, Prabhas, Radha Krishna, Radhe Shyam, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ప్రేక్షకులకు ఎట్టకేలకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు చిత్ర యూనిట్.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.

 Prabhas Pooja Hegde Radha Krishna

రాధేశ్యామ్ అనే టైటిల్‌తో ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

ఇక రాధేశ్యామ్ చిత్ర పోస్టర్, టైటిల్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో పెట్టారు.

సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రాధేశ్యామ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

#RadheShyam అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు.దీంతో ఈ పోస్టర్ ట్విట్టర్‌లో ఏకంగా 3.8 మిలియన్ ట్వీట్స్‌తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.ఒక సింగిల్ హ్యాష్‌ట్యాగ్‌కు ఇంతటి భారీ రెస్పాన్స్ రావడం ఇదే తొలిసారి అని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ప్రభాస్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఈ సెన్సేషన్‌తో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది.

జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త వింటేజ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు.కాగా ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి కాగా, కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం వాయిదా పడింది.

#Radha Krishna #Prabhas #Pooja Hegde #Radhe Shyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Pooja Hegde Radha Krishna Related Telugu News,Photos/Pics,Images..