పూజా హెగ్డే కెరీర్‌ ఆ రెంటిపైనే ఆధారపడి ఉంది  

Pooja Hegde Career Depend On Prabhas And Akhil Movies, Prabhas, Pooja Hegde, Akhil, Most Elegible Bachelor, Radheshyam, Kollywood, Tollywood - Telugu Akhil, Kollywood, Most Elegible Bachelor, Pooja Hegde, Prabhas, Radheshyam, Tollywood

తెలుగు ప్రేక్షకులకు చాలా సంవత్సరాల క్రితమే హీరోయిన్‌గా పరిచయం అయిన పూజా హెగ్డే మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోక పోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది.రెండేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ తెలుగులో డీజే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

 Prabhas Pooja Hegde Akhil

రీ ఎంట్రీలో రెచ్చి పోయి స్కిన్‌ షో చేయడంతో ఈ అమ్మడి దశ తిరిగి పోయింది.అయితే ఆ హడావుడి రెండు మూడు సంవత్సరాలు మాత్రమే కనిపించింది.

ఆమద్య రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎలా ఉవ్వెత్తున ఎగిసి పడినదో అలాగే ఈమె కూడా ఎగసి పడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం ఈమె చేతిలో అఖిల్‌ నటిస్తున్న మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ ఇంకా ప్రభాస్‌ రాధేశ్యామ్‌ చిత్రాలు మాత్రమే ఉన్నాయి.

పూజా హెగ్డే కెరీర్‌ ఆ రెంటిపైనే ఆధారపడి ఉంది-Movie-Telugu Tollywood Photo Image

ఆ రెండు సినిమాలు కాకుండా మరే సినిమాలను ఈమె చేయడం లేదు.ఈమెకు ఆఫర్లు తగ్గాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాల ఫలితాలపై ఈమె కెరీర్‌ ఆధారపడి ఉంటుంది.

ప్రభాస్‌ రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ సగం పూర్తి కాగా అఖిల్‌ మూవీ కేవలం 20 శాతం మాత్రమే బ్యాలన్స్‌ ఉందట.ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలో విడుదల అయ్యేవి కాని కరోనా కారణంగా ఎప్పటికి విడుదల అయ్యేది తెలియడం లేదు.ఈలోపు ఈమెకు ఆఫర్లు వచ్చే పరిస్థితి కూడా లేదు.

కనుక పూజా హెగ్డే దాదాపుగా పూర్తి అయ్యిందని ఈ రెండు సినిమాలు జరిగి అద్బుతం జరిగితే పూజా హెగ్డే మళ్లీ బిజీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.తమిళంలో కూడా ఈమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు.

టాలీవుడ్‌లో ఛాన్స్‌ లేకుంటే కోలీవుడ్‌కు వెళ్లే అవకాశం ఉంది.మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

#Radheshyam #Prabhas #Akhil #Kollywood #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Pooja Hegde Akhil Related Telugu News,Photos/Pics,Images..