లేటెస్ట్ బజ్ : సలార్ లో ప్రభాస్ డ్యూయెల్ రోల్ ?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాలీవుడ్ హీరోలను సైతం బయపెడుతున్నాడు.ఇతని స్టామినా రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.

 Prabhas Played Dual Role In Salaar Movie-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ నాలుగు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ సినిమా ఒకటి.

ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

 Prabhas Played Dual Role In Salaar Movie-లేటెస్ట్ బజ్ : సలార్ లో ప్రభాస్ డ్యూయెల్ రోల్ -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికం గా ప్రకటించారు.

శృతి హాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ గా నటిస్తుంది.ప్రభాస్ తొలిసారి శృతి హాసన్ తో నటిస్తున్నాడు.అందుకే ఫ్యాన్స్ ఈ జంట తెరమీద ఎలా ఉంటదా అని ఉహించు కుంటున్నారు.హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించ బోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో కనిపించ బోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది.ఈ సినిమాలో గతం ఉంటుందట. ప్రభాస్ గతంలో ఒక రకంగా, ప్రెసెంట్ లో ఒక రకంగా కనిపించనున్నట్టు టాక్ నడుస్తుంది.ఈ విషయం విన్న ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.

రెండు విభిన్న పాత్రలలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడో ప్రేక్షకులు అంచనా వేయలేకపోతున్నారు.

మరి ఈ వార్త నిజమైతే ఈ సినిమా రికార్డ్స్ ను ఎవ్వరు ఆపలేరు.ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ నిలిపి వేశారు.ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14 న విడుదల కానుంది.

ప్రభాస్ ఈ సినిమాతో పాటు రాధే శ్యామ్, ఆది పురుష్ సినిమాలు కూడా చేస్తున్నాడు.

#Prabhas #Dual Role #Shruti Haasan #PrabhasPlayed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు