జపాన్ లో ప్రభాస్ క్రేజ్.. ఆయనను ఇలా కూడా వాడేస్తున్నారుగా..

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని మరే హీరోకు లేని క్రేజ్ ను అభిమానాన్ని సంపాదించుకున్నాడు.మన ఇండియాలోనే కాకుండా ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

 Prabhas Pics Rocking On Japanese Ikea Bottles Details, Bahubali,japan,prabhas,ra-TeluguStop.com

మరీ ముఖ్యంగా ప్రభాస్ కు జపాన్ లో మరింత ఫాలోయింగ్ ఉంది.బాహుబలి సినిమా జపాన్ లో సంచలన విజయం సాధించింది.

ఇక అప్పటి నుండి జపాన్ వాసులు ప్రభాస్ ను ఇష్టపడడం మొదలుపెట్టారు.

ప్రభాస్ కటౌట్, లుక్స్, యాక్టింగ్ కు జపాన్ వాసులు ఫిదా అయ్యారు.

బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పటి నుండి జపాన్ వాసులు ప్రభాస్ ను ఆరాధించడం మొదలుపెట్టారు.బాహుబలి సినిమా వచ్చి ఏళ్ళు గడుస్తున్నా వారు ప్రభాస్ యాక్టింగ్ ను మర్చిపోలేకపోతున్నారు.

దీంతో అప్పటి నుండి జపాన్ వాసులు, అక్కడి మీడియా ప్రభాస్ ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి ఇష్టపడతారు.

ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా విషయంలో మరొకసారి ప్రభాస్ పై వారికున్న అభిమానాన్ని, ప్రేమను చూపిస్తున్నారు.

Telugu Bahubali, Japan, Prabhas, Prabhascraze, Prabhaspics, Radheshyam, Radhy Sh

తాజాగా జపాన్ కు చెందిన కూల్ డ్రింక్​ బాటిల్స్ క్రేట్ చిత్రాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.ఆ సీసాల లేబుల్స్ పై ప్రభాస్ పిక్ ఉండడం విశేషం.జపాన్ లో ఐకియా స్టోర్ లో ఈ లేబుల్స్ తో ఉన్న ఖాళీ గాజు సీసాలను విక్రయిస్తున్నారు.

Telugu Bahubali, Japan, Prabhas, Prabhascraze, Prabhaspics, Radheshyam, Radhy Sh

ఆ సీసాలకు ప్రభాస్ రాధేశ్యామ్ ట్రైలర్ లుక్ లో ఉన్న పిక్స్ ఉన్నాయి.మరి ప్రభాస్ అనుమతితో ఇలా చేసారో లేదంటే వారే సొంతంగా ఇలా చేసారో తెలియదు.కానీ ఈ ఫోటోలు మాత్రం ప్రెజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అప్పట్లో బాహుబలి ఆర్ట్ మెటీరియల్స్ తో పాటు మిగతా వాటిని కూడా తయారు చేసి బాహుబలి టీమ్ తో పంచుకున్నారు.ఇక ఇప్పుడు త్వరలోనే రాధేశ్యామ్ టీమ్ కూడా ఇలాంటివి పొందే అవకాశం ఉందని అందరు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube