యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె.వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 500 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నట్ట్టు తెలుస్తుంది.
సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.మెయిన్ కాస్టింగ్ అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది.
ఇక షూటింగ్ పూర్తయ్యాక ప్రభాస్ చిత్రయూనిట్ మొత్తానికి ఓ స్పెషల్ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తుంది.ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాలో బిగ్ బీ అమితాబ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.
ప్రభాస్ సితార గ్రాండ్ లో పార్టీ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఈ పార్టీలో అమితాబ్, దీపికా పదుకొనె కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది.
ప్రాజెక్ట్ కె సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని తెలుస్తుంది.ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత ప్రాజెక్ట్ కె రిలీజ్ అవుతుంది.