కరోనాపై ప్రభాస్ ఏమన్నాడంటే?

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు.

 Prabhas On Covid 19 Virus-TeluguStop.com

కరోనా వైరస్ ఎప్పుడు, ఎలా వస్తుందా అని అందరూ భయాందోళనకు గురవుతున్నారు.అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ పలు దేశాల ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

అటు పులవురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల ఆర్ఆర్ఆర్ హీరోలు తారక్, చరణ్‌లు కలిసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కలిగించే విధంగా ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, కోవిద్-19 వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, తద్వారా దాని నుండి తప్పించుకోవచ్చని కోరాడు.ప్రస్తుతం ఉన్న భయాందోళన పరిస్థితిని అందరూ సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలని ప్రభాస్ కోరాడు.

ఇలా పలువురు ప్రముఖులు తమకు తోచిన విధంగా ప్రజలను అప్రమత్తం చేస్తుండటం, వారికి కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తుండటంత నిజంగా హర్షనీయం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తు్న్నారు.ఇక ‘ఓ డియర్’ సినిమా షూటింగ్‌ను వాయిదా వేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube