ఆదిపురుష్ షూటింగ్ కేవలం 60 రోజులే అంట

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మొదటి హిందీ సినిమా ఆదిపురుష్.ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాని టి-సిరీస్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 Director Plan To Finish With In 60 Days Adi Purush Shooting, Darling Prabhas, Om-TeluguStop.com

ఇక ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది.పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఈ సినిమాలో శ్రీరాముడు పాత్రలో కనిపించబోతున్నాడు.

అయితే ఇది వరకు రామాయాణంలో చూసిన విధంగా కాకుండా పవర్ ఫుల్ గా రాముడు పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో మిగిలిన క్యాస్టింగ్ కోసం ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన మరో ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది.పాన్ ఇండియా సినిమాలు అంటే భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కుతాయి.

ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలు రెండేళ్ళకి పైగా షూటింగ్ జరుపుకున్నవే.

నాగ్ అశ్విన్ తో చేయాల్సిన చిత్రం పూర్తయిన తర్వాత సెట్స్ కు వెళ్లే ఈ చిత్రం షూటింగును కేవలం 60 రోజుల్లో పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ముందుగా ప్రభాస్ తో చేయాల్సిన షూటింగును పూర్తిచేసి, ఆ తర్వాత మిగతా వారితో చేయాల్సిన షూటింగును చేస్తారట.రామాయణం ఆధారంగా రూపొందే సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో ఎక్కువగా స్టూడియోలోనే షూటింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది.

సుమారు 350 కోట్ల బడ్జెట్టుతో రూపొందే ఈ సినిమాలో సీత పాత్ర కోసం కీర్తి సురేష్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా ఒక మైథలాజికల్ ఎలిమెంట్ తో సోషియో ఫాంటసీగా తెరకెక్కబోయే సినిమా షూటింగ్ అరవై రోజులలో పూర్తి చేయడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం.

మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube