హలో ప్రభాస్‌ ఇక వైకుంఠపురంలో జాయిన్‌ అవుతావా?  

Prabhas Ok For Trivikram Movie ? - Telugu Prabhas, Prabhas In John Movie, Prabhas Waiting For Trivikram, Trivikram And Ala Vaikuntapuram Lo, Trivikram And Allu Arjun, Trivikram And Prabhas

ప్రభాస్‌ ప్రస్తుతం జాన్‌ చిత్రంలో నటిస్తున్నాడు.జిల్‌ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.

Prabhas Ok For Trivikram Movie ?

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ సినిమాను సమ్మర్‌ తర్వాత విడుదల చేయబోతున్నారు.ఆ సినిమా విడుదల అవ్వకముందే ఈయన తదుపరి చిత్రంకు సంబంధించిన క్లారిటీ ఇవ్వబోతున్నాడు.

అందుకు సంబంధించిన చర్చలు మరియు సంప్రదింపులు జరుగుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

నిన్న మొన్నటి వరకు ఒక నిర్మాత ప్రభాస్‌ మరియు త్రివిక్రమ్‌ల కాంబోకు ప్రయత్నాలు చేశాడట.ఆయన తప్పకుండా వీరిద్దరితో ఒక సినిమాను నిర్మించేందుకు చాలా ప్రయత్నాలు చేయడం జరిగిందట.అయితే ప్రభాస్‌ మొన్నటి వరకు వెయిట్‌ అండ్‌ సీ అన్నట్లుగా వ్యవహరించాడని సమాచారం.

ఎందుకంటే గతంలో మాదిరిగా త్రివిక్రమ్‌ ఫామ్‌లో లేడు.అందుకే ఆయన అల వైకుంఠపురంలో సినిమా ఫలితం తర్వాత ప్రభాస్‌ నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు.

ఇప్పుడు సంక్రాంతి సందర్బంగా అల వైకుంఠపురంలో సినిమా వచ్చేసింది.ఆ సినిమా హిట్‌ టాక్‌ దక్కించుకుంది.వంద కోట్ల దిశగా దూసుకు పోతుంది.ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ టాప్‌ సినిమాల జాబితాలో అల వైకుంఠపురంలో జాయిన్‌ అయ్యే అవకాశం కనిపిస్తుంది.అందుకే ఈ చిత్రం తర్వాత ప్రభాస్‌ ఏమాత్రం ఆలోచించకుండా త్రివిక్రమ్‌కు ఓకే చెప్పే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి ప్రభాస్‌ త్రివిక్రమ్‌ కాంబో ఈ ఏడాది వస్తుందో లేదంటే 2021 వరకు వెయిట్‌ చేయాలో కాలమే నిర్ణయిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Ok For Trivikram Movie ? Related Telugu News,Photos/Pics,Images..

footer-test