మహేష్‌ను చూసి నేర్చుకోండి.. ప్రభాస్-తారక్‌లపై ఫ్యాన్స్ ఆగ్రహం!  

Prabhas Ntr Fans Fire On Them For Mahesh Babu Step - Telugu Mahesh Babu, Ntr, Parasuram, Prabhas

ప్రస్తుతం టాలీవుడ్‌లో తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆతృత ప్రతి ఒక్క స్టార్ హీరో అభిమానుల్లో నెలకొంది.ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ లాంటి హీరో అభిమానులు తమ హీరోల సినిమాలకు సంబంధించిన న్యూస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Prabhas Ntr Fans Fire On Them For Mahesh Babu Step

అయితే వీరిలో మహేష్ ఫ్యాన్స్‌కే కాస్త గౌరవం దక్కిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ప్రభాస్ నటిస్తున్న ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ చిత్ర నిర్మాత అయిన యువీ క్రియేషన్స్‌పై విరుచుకుపడ్డారు.

మహేష్‌ను చూసి నేర్చుకోండి.. ప్రభాస్-తారక్‌లపై ఫ్యాన్స్ ఆగ్రహం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో తన ఫ్యాన్స్‌పై ప్రభాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని రాజమౌళి అండ్ టీమ్‌ను నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏసుకున్నారు.

కాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను అనౌన్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.

అయితే వారి నిరాశను గుర్తించిన మహేష్, వారితో మాట్లాడేందుకు సిద్ధమయ్యాడు.

దీని కోసం ఏకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చాట్ సెషన్ కూడా నిర్వహించేందుకు రెడీ అయ్యాడు.ఈ మేరకు మే 31న సాయంత్రం మహేష్ తన ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు.

దీంతో ప్రభాస్, తారక్ ఫ్యాన్స్ తమ హీరోలపై మండిపడుతున్నారు.తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం ఎదురుచూడటం తప్పా అని వారు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు.

ఫ్యాన్స్ అంటే మీకు లెక్క లేదా, మహేష్ బాబును చూసి ఫ్యాన్స్ పట్ల ఎలా ఉండాలో నేర్చుకోండి అంటూ వారు తమ ఫేవరెట్ హీరోల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test