ప్రభాస్ ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్.. ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ ఇదే!

కొన్ని కాంబినేషన్లలో సినిమా తెరకెక్కడం అసాధ్యం అని ప్రేక్షకులు సైతం భావిస్తుంటారు.అయితే ఆ కాంబినేషన్లలో సినిమా తెరకెక్కడం వల్ల ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు.

 Prabhas Ntr Combo Multistarrer Movie Details Here Goes Viral , Movie Details, Ntr, Prabhas, Prabhas Ntr Combo-TeluguStop.com

కొన్నేళ్ల క్రితం వరకు చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ సైతం భావించలేదు.అయితే దర్శకధీరుడు రాజమౌళి వల్ల ఈ అసాధ్యమైన కాంబినేషన్ లో సినిమా సాధ్యమైంది.

త్వరలో ప్రభాస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.కరణ్ జోహార్ ఈ కాంబినేషన్ లో సినిమా దిశగా అడుగులు వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

 Prabhas Ntr Combo Multistarrer Movie Details Here Goes Viral , Movie Details, Ntr, Prabhas, Prabhas Ntr Combo-ప్రభాస్ ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్.. ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కాంబినేషన్ లో పాన్ ఇండియా యాక్షన్ మూవీ తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది.ఉమైర్ సంధు సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ లో సినిమా గురించి వెల్లడించడం గమనార్హం.

ఉమైర్ సంధు మాటలు కొన్నిసార్లు నిజమైతే మరి కొన్నిసార్లు అబద్ధం అని ప్రూవ్ అయ్యాయి.ప్రభాస్, ఎన్టీఆర్ నిజంగా కలిసి నటిస్తారో లేదో చూడాల్సి ఉంది.

ఈ ఇద్దరు హీరోలకు ఊహించని స్థాయిలో క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా ఉంది.ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో అపజయం ఎరుగని డైరెక్టర్ ఎవరైనా సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వైరల్ అవుతున్న వార్తలపై హీరోలు లేదా కరణ్ జోహార్ స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.ప్రేక్షకులు మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు ఆదిపురుష్ సినిమాలో కూడా నటిస్తున్నారు.ప్రభాస్, ఎన్టీఆర్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube