ప్రభాస్ తో అర్జున్ రెడ్డి దర్శకుడు సినిమా... ఏడాది వెయిటింగ్  

Prabhas Next Movie With Sandeep Reddy Vanga - Telugu Bollywood, Pan India Movie, Prabhas Next Movie, Sandeep Reddy Vanga, Tollywood

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.మొదటి సినిమానే బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి అదిరిపోయే హిట్ కొట్టిన ఈ దర్శకుడు అదే సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో తెరకెక్కించి అక్కడ కూడా హిట్ కొట్టాడు.

Prabhas Next Movie With Sandeep Reddy Vanga - Telugu Bollywood, Pan India Movie, Prabhas Next Movie, Sandeep Reddy Vanga, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

కబీర్ సింగ్ టైటిల్ తో బాలీవుడ్ లో తెరకెక్కిన ఆ సినిమా అంచనాలు మించి సూపర్ హిట్ అయ్యింది.అలాగే రెండు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి నెక్స్ట్ సినిమాని బాలీవుడ్ లో చేస్తాడని మొన్నటి వరకు టాక్ వినిపించింది.అయితే ఇప్పుడు ఊహించని విధంగా అతను కూడా పాన్ ఇండియా మూవీ దర్శకుడుగా మారిపోయాడు.

సందీప్ రెడ్డి నెక్స్ట్ సినిమాని ప్రభాస్‌ తో చేయబోతున్నాడు.మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది.ఈ విషయాన్ని ఇటీవలే మైత్రీ మూవీస్‌ ప్రకటించింది.ఇది తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందించబోతున్నారు.

అందుకోసం తెలుగులో మైత్రీ మూవీస్‌ తో పాటు, బాలీవుడ్‌లో ఓ నిర్మాణ సంస్థ భాగస్వామ్యం కానున్నాయి.అయితే ప్రస్తుతం ప్రభాస్ జాను సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ అయ్యేసరికి ఈ ఏడాది ఆఖరు అయిపోతుంది.ఈ నేపధ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో సందీప్ సినిమాని ప్రభాస్ సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

అయితే ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్న నేపధ్యంలో జాను తర్వాత ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉంది.అది జరిగితే సందీప్ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు