మరో పాన్ ఇండియా మూవీకి ప్రభాస్ సై..?  

Prabhas Next Movie With Bollywood Producer, Prabhas, Prabhas 21, Bollywood News, Pan India Movie - Telugu Bollywood News, Pan India Movie, Prabhas, Prabhas 21

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Prabhas Next Movie With Bollywood Producer

కాగా ఈ సినిమాను పీరియాడికల్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను క్యూలో పెడుతున్నాడు.

ఇప్పటికే మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్ స్టార్.ఇక ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ చిత్రంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు, ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

మరో పాన్ ఇండియా మూవీకి ప్రభాస్ సై..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే ప్రభాస్ మరో భారీ ప్రాజెక్టును ఓకే చేసేందుకు రెడీ అయ్యాడట.

ప్రముఖ బాలీవుడ్ నిర్మణ సంస్థ టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఓ భారీ పాన్ ఇండియా మూవీని ప్రభాస్ హీరోగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాను నేరుగా హిందీలో తెరకెక్కించి, ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నాడట.ఇక ఈ సినిమాను తెరకెక్కించేందుకు సరైన దర్శకుడితో పాటు అదిరిపోయే టెక్నీషియన్‌లను వెతికే పనిలో సదరు నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సినిమా పూర్తి మైథలాజికల్ కథగా రానుందట.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు భూషణ్ కుమార్ రెడీ అవుతున్నాడు.

#Pan India Movie #Prabhas #Prabhas 21

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Next Movie With Bollywood Producer Related Telugu News,Photos/Pics,Images..