జాన్ కూడా ఆ జోనర్ లోనే! సాహసం చేస్తున్న ప్రభాస్  

ప్రభాస్ నెక్స్ట్ సినిమా కూడా యాక్షన్ నేపధ్యంలోనే. .

Prabhas Next Movie Also Action Backdrop Love Story-bollywood,prabhas Next Movie,radhakrishna,tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ బాహుబలి తర్వాత ఒక్కసారిగా పెరిగిపోయింది. అతను ఏకంగా ఇండియన్ యాక్షన్ హీరో అయిపోయాడు. అతని బాడీ లాంగ్వేజ్, లుక్స్ హాలీవుడ్ హీరోల రేంజ్ లో యాక్షన్ సినిమాలకి కరెక్ట్ గా సరిపోయే విధంగా ఉండటంతో ప్రభాస్ కూడా అదే జోనర్ లో సాహో సినిమాని తెరకెక్కిస్తున్నాడు..

జాన్ కూడా ఆ జోనర్ లోనే! సాహసం చేస్తున్న ప్రభాస్ -Prabhas Next Movie Also Action Backdrop Love Story

ఈ సినిమా హాలీవుడ్ యాక్షన్ సినిమాల రేంజ్ లో ప్రభాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని మేకింగ్ వీడియోల ద్వారా స్పష్టం అయిపొయింది. ఇదిలా ఉంటే సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న జాన్ సినిమా పారిస్ నేపధ్యంలో సాగే పీరియాడికల్ లవ్ స్టొరీ అని అందరూ అనుకుంటున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇది పూర్తిస్థాయి ప్రేమకథ సినిమా కాదని, ఇందులో ఎబ్భై శాతం యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని ప్రభాస్ ఓ జాతీయ మీడియాతో చెప్పుకొచ్చాడు.

తన నుంచి ప్రేక్షకులు కూడా అలాంటి యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలే కోరుకుంటున్నారని, అందుకే అలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టం చేసాడు. ఇక ఆ సినిమాలో లవ్ స్టొరీతోపాటే యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి ఉంటాయని ప్రభాస్ మాటల బట్టి స్పష్టం అవుతుంది.