పోస్టర్ టాక్ :  ప్రభాస్ ఆ మెగా హీరో ని కాపీ కొడుతున్నాడట…  

Radhe shyam, Poster Talk, Tollywood movie, Prabhas new movie news, Pooja hegde, Radhe shyam movie Poster Talk - Telugu Pooja Hegde, Poster Talk, Prabhas New Movie News, Radhe Shyam, Radhe Shyam Movie Poster Talk, Tollywood Movie

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.

 Prabhas New Movie Radhe Shyam Poster Talk

కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కేకే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాలలో విడుదల చేశారు.

పోస్టర్ టాక్ :  ప్రభాస్ ఆ మెగా హీరో ని కాపీ కొడుతున్నాడట…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నప్పటికీ మరికొంతమంది మాత్రం ఈ చిత్ర పోస్టర్లు అప్పట్లో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించినటువంటి  కంచె చిత్ర పోస్టర్లను పోలి ఉన్నాయని తెగ కామెంట్లు చేస్తున్నారు.మరికొంతమంది గతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు తన భార్యతో దిగినటువంటి ఫోటోని చూసి కాపీ చేశారంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా బాహుబలి సినిమా తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ మళ్ళీ తన తదుపరి చిత్రం గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.దీంతో మొదట్లో ప్రభాస్ అభిమానులు కొంతమేర నిరాశకు గురైనప్పటికీ రాధే శ్యామ్ చిత్ర పోస్టర్ విడుదల చేయడంతో కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు.

అంతేగాక అంచనాలు కూడా బాగానే పెట్టుకుంటున్నారు.మరి ప్రభాస్ రాధే శ్యామ్ తో తన అభిమానులను ఎలా అలరిస్తాడో చూడాలి.

#Pooja Hegde #Radhe Shyam #Poster Talk

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas New Movie Radhe Shyam Poster Talk Related Telugu News,Photos/Pics,Images..