ప్రభాస్ కొత్త సినిమా లుక్... ఫాన్స్ కి కిరాక్  

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సాహో సినిమా దేశ వ్యాప్తంగా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న డివైడ్ టాక్ తెచ్చుకుంది.అయితే ఈ సినిమా ప్రభాస్ ని మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులు భాగా ఆదరించారు.

TeluguStop.com - Prabhas New Look Jaanu Movie Pooja Hegde

ప్రభాస్ లుక్స్, స్టైల్స్ కి బీటౌన్ ప్రేక్షకులు భాగా కనెక్ట్ అయ్యారు.సౌత్ లో రజిని కాంత్ తర్వాత ఆ స్థాయిలో ప్రభాస్ కి ఫాలోయింగ్ పెరిగిపోతుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టొరీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతూ ఉంది.

త్వరలో పూజాహేగ్దే కూడా ఈ సినిమా షూటింగ్ లో భాగం అవుతుంది.

ఇదిలా ఉంటే సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ఒక అప్డేట్ ఇస్తానని ప్రభాస్ తెలియజేశారు.

ఇక దానికి తగ్గట్లుగానే ఈ రోజు తాజా సినిమా నుంచి ఒక లుక్ ని సోషల్ ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ పంచుకోవడంతో పాటు, లేటెస్ట్ మూవీ షూట్ తిరిగి షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు తెలిపారు.అలాగే ఈ షెడ్యూల్ చాలా ఫన్ రైడ్ లా ఉంటుందని కూడా తెలియజేశాడు.

ఇక ఈ ఫోటోస్టిల్ లో ప్రభాస్ ఓ విలాసవంతమైన వింటేజ్ భవంతిలో పురాతన పియానో, గోడలపై చాలా ఫోటో గ్రాఫ్స్ ఉండగా వాటి వైపు ఆసక్తిగా చూస్తున్నట్లు ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ ని చేంజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

#Prabhas Shares #Social Media #Pan India Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు