మల్టీస్టారర్ మూవీలో ప్రభాస్.. ఇంకో హీరో ఎవరో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.

 Prabhas To Do A Multistarrer Movie, Prabhas, Radheshyam, Nag Ashwin, Uv Creation-TeluguStop.com

ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా వైడ్‌గా బ్లాక్‌బస్టర్‌ను అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.ఈ క్రమంలో ప్రభాస్, తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమా తెరకెక్కకముందే మరో సినిమాను ఓకే చేసే పనిలో పడ్డాడు.బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ ప్రభాస్‌తో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

కాగా ఈ డైరెక్టర్ కథలో ఇద్దరు హీరోలు ఉంటారట.అందుకోసమే ఈ సినిమాను మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించాలని, మరో హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా అనౌన్స్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ అప్పుడే ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ల రిలీజ్ గురించి చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube