మరో ఏడాది ఖాళీ అంటోన్న ప్రభాస్  

Prabhas Nag Ashwin Movie Only In 2022, Prabhas, Nag Ashwin, Prabhas 21, Vyjayanthi Movies - Telugu Nag Ashwin, Prabhas, Prabhas 21, Vyjayanthi Movies

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Prabhas Nag Ashwin Movie Only In 2022

ఇక ఈ సినిమాకు ‘రాధేశ్యామ్’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమా పూర్తి కాకముందే, తన నెక్ట్స్ చిత్రాన్ని మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్‌తో చేసేందుకు రెడీ అయ్యాడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినిదత్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుండగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రానుంది.కాగా ఈ సినిమా షూటింగ్‌ను తొలుత ఈ ఏడాది చివరికల్లా పట్టాలెక్కించాలనే ప్లాన్ వేశారు చిత్ర యూనిట్.

మరో ఏడాది ఖాళీ అంటోన్న ప్రభాస్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ కరోనా వైరస్ కారణంగా రాధేశ్యామ్ చిత్రం మరింత ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.దీని ప్రభావం నాగ్అశ్విన్ చిత్రంపై కూడా పడింది.

2021లోనైనా సినిమా షూటింగ్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావించగా, ఇప్పుడు అది కాస్త 2022కు వాయిదా పడింది.భారీ వీఎఫ్ఎక్స్ పనులకు ఆలస్యం అవుతుందనే కారణంగా ఈ సినిమా షూటింగ్ 2022లో పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

సూపర్ హీరో తరహా ఫిక్షనల్ కథగా ఈ సినిమాను నాగ్అశ్విన్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.మరి ప్రభాస్ 2021లో కూడా పూర్తిగా ఖాళీగా ఉండనున్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది.

#Prabhas 21 #Nag Ashwin #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Nag Ashwin Movie Only In 2022 Related Telugu News,Photos/Pics,Images..