సూపర్ హీరో సినిమాలో రెండు అంటోన్న ప్రభాస్  

Prabhas Nag Ashwin Crazy Rumour, Prabhas, Nag Ashwin, Prabhas 21, Super Hero, Tollywood News - Telugu Nag Ashwin, Prabhas, Prabhas 21, Super Hero, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఫస్ట్ లుక్‌ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, అదిరిపోయే రికార్డును అది క్రియేట్ చేసింది.వింటేజ్ లుక్‌లో ప్రభాస్ తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.

 Prabhas Nag Ashwin Crazy Rumour

ఇక ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇంకా పూర్తికాకముందే తన నెక్ట్స్ మూవీకి ఓకే చెప్పేశాడు ప్రభాస్.

మహానటి చిత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ ప్రొడ్యూస్ చేయనున్నాడు.

సూపర్ హీరో సినిమాలో రెండు అంటోన్న ప్రభాస్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఫిక్షనల్ మూవీగా ఈ సినిమా కథ ఉండబోతుందని చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలోని పాత్రలు ఓ పురాణ కథలోని పాత్రల ఆధారంగా ఉండబోతున్నాయట.అందులో భాగంగా ప్రభాస్ ఇందులో రెండు విభిన్న పాత్రల్లో నటిస్తాడని తెలుస్తోంది.

ఇక మిగతా పాత్రల కోసం నాగ్ అశ్విన్ బాలీవుడ్ స్టార్స్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా మలిచేందుకు నాగ్ అశ్విన్ ప్రయత్నం చేస్తున్నాడట.

కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించి ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది.మరి సూపర్ హీరోగా మారిన ప్రభాస్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.

#Prabhas #Super Hero #Prabhas 21 #Nag Ashwin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Nag Ashwin Crazy Rumour Related Telugu News,Photos/Pics,Images..