ప్రభాస్ కోసం అంతా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన సత్తాను చాటాలన చూస్తున్నాడు.

 Prabhas Movie To Huge Vfx Budget-TeluguStop.com

ఇప్పటికే బాహుబలి, సాహో చిత్రాలతో ప్రభాస్ రేంజ్ ఏమిటో అందరికీ తెలిసింది.కాగా ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించాలని చూస్తున్నాడు.

ఇక ప్రభాస్ 21వ చిత్రంగా దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాలో ప్రభాస్ కొత్త గెటప్‌లో మనకు దర్శనమిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.

ఈ క్రమంలో ఈ సినిమాలో గ్రాఫిక్స్ పనులను భారీ స్థాయిలో పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఏమాంత్ర ప్రభాస్ స్థాయికి తగ్గకుండా గ్రాఫిక్స్‌ను పెట్టాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

ఈ క్రమంలో కేవలం గ్రాఫిక్స్ కోసమే ఈ సినిమాలో రూ.50 కోట్ల మేర బడ్జెట్‌ను కేటాయించనున్నారట నిర్మాత అశ్వనీదత్.ప్రభాస్ కోసం ఈమాత్రం బడ్జెట్ కేటాయించకపోతే ఎలా అని ఆయన అంటున్నారు.మొత్తానికి ప్రభాస్ చిత్రం భారీ బడ్జెట్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మరి ఈ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube