ప్రభాస్ కి కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్...

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్.ఎస్.

 Prabhas Movie Shooting Postponed For Coronavirus Effect-TeluguStop.com

రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రం తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసింది.అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి  కూడా తన జీవితంలో లైఫ్ టైం రికార్డుని క్రియేట్ చేసింది.

అయితే అప్పటి నుంచి ప్రభాస్ దాదాపుగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు.ఇందులో భాగంగా ఇటీవల కాలంలో యువ దర్శకుడు సంగీత దర్శకత్వం వహించిన టువంటి సాహో చిత్రంలో నటించాడు.

అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినప్పటికీ అప్పటికీ వసూళ్లు మాత్రం గట్టిగానే సాధించింది.

అయితే ప్రస్తుతం ప్రభాస్ “జాన్” అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ ఈ చిత్రానికి సంబంధించినటువంటి పలు కీలక సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. అయితే తాజాగా కరోనా వైరస్ దేశంలో కలకలం సృష్టిస్తున్నడంతో  ఈ చిత్ర షూటింగ్ కొంత కాలం పాటు వాయిదా వేస్తున్నట్లు సమాచారం.

అంతేగాక కొన్ని పాటల షూటింగ్ నిమిత్తమై చిత్ర యూనిట్ సభ్యులు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, వంటి దేశాల్లో షెడ్యూల్ ఖరారు చేశారు.కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల ఈ షెడ్యూల్ ని కూడా క్యాన్సిల్ చేసి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని షూటింగ్ జరపాలని నిర్ణయించుకున్నారు.

అయితే అన్నీ కుదిరితే ఈ చిత్రాన్ని మేలో విడుదల చేసేందుకు రాధాకృష్ణ సన్నాహాలు చేస్తున్నాడు కానీ ఇలా షూటింగ్ ఇలా వాయిదా పడడంతో ఈ చిత్రం విడుదల మరింత లేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Prabhas, Prabhas Latest-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రభాస్ అప్పట్లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన అటువంటి సావిత్రి జీవిత కథను కళ్ళకు కట్టినట్లు తెరకెక్కించిన  దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కి సంబంధించి ఉంది.దీంతో మరోసారి భారీ పెద్ద ప్రాజెక్టు కి శ్రీకారం చుట్టాడు ప్రభాస్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube