ఒక్క సెట్‌కు మూడు కోట్లు.. అక్కడ ఉన్నది ప్రభాస్!  

Prabhas Movie Set Costs 3 Crores-movie Set,prabhas,telugu Gossips,telugu Movie News

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు.సాహో చిత్రం తరువాత కాస్త గ్యాప్ తీసుకుని ప్రభాస్ ఈ సినిమా చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Prabhas Movie Set Costs 3 Crores-Movie Prabhas Telugu Gossips Telugu News

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టిల్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.

చాలా రిచ్‌గా ఉన్న ఈ స్టిల్‌ కోసం ఓ భారీ సెట్‌ను వేశారు చిత్ర యూనిట్.

ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.అయితే ఈ సెట్‌లో మొర్రాకో టైల్స్‌తో వేసిన ఫ్లోరింగ్, యాంటిక్ పియానో, ఖరీదైన కార్పెట్స్ లాంటివి వాడారు.దీంతో ఈ సెట్‌ ఖరీదు ఏకంగా రూ.3 కోట్లకు చేరిందని చిత్ర నిర్మాతలు తెలిపారు.

ఈ సినిమా 70లలో జరిగే పీరియాడికల్ లవ్ స్టోరీ అని వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ స్పందించింది.ఇది పీరియాడికల్ మూవీ కాదని, కొత్త తరహా లవ్ స్టోరీ అని దర్శకుడు రాధాకృష్ణ తెలిపాడు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత షెడ్యూల్ కోసం ఆస్ట్రియా వెళ్లనున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు

Prabhas Movie Set Costs 3 Crores-movie Set,prabhas,telugu Gossips,telugu Movie News Related....