ప్రభాస్ కి అభిమానులే ముఖ్యం అంటా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో నేషనల్ హీరో అయిపోయాడు.ఇప్పుడు అతని సినిమాలు అన్ని కూడా దేశీయ సినీ మార్కెట్ ని శాసిస్తాయి.

 Prabhas Movie Selection On Depends On Fans Interest-TeluguStop.com

దేశ వ్యాప్తంగా ప్రభాస్ కి విశేషమైన అభిమానులు ఉన్నారు.ఈ నేపధ్యంలో తన నెక్స్ట్ సినిమాలు కూడా భారీగా యాక్షన్ నేపధ్యంలో అభిమానులు తనని ఎలా చూడాలని అనుకుంటారో అలాంటి పాత్రలతోనే ఉండనున్నాయి అనే విషయం అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రభాస్ తన సినిమాల ఎంపికపై ఓ ఆంగ్ల పత్రికతో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.

తాను ఎ కథ విన్న అభిమానుల కోణంలో ఆలోచించి స్క్రిప్టు ఎంచుకుంటానని కథానాయకుడు ప్రభాస్‌ తెలిపారు.

ప్రేక్షకులు నన్ను ఇంతగా ప్రేమించి, ఆదరించడం నా అదృష్టం.ప్రజలు నా నుంచి చాలా ఆశిస్తున్నారు.

నా నుంచి ది బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న, ప్రతి ప్రాజెక్టు వారి అంచనాలకు తగ్గట్టు ఉండేలా చూసుకుంటా.నేను స్క్రిప్టు ఎంచుకునేటప్పుడు నా అభిమానులు నన్ను ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారని ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అని తెలియజేసారు.

ప్రభాస్ మాటలతో ఇప్పుడు తెలుగునాట అభిమానులు తెగ ఫిదా అయిపోతున్నారు అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube