యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా కేజీఎఫ్ మేకర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.టీజర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఇప్పటి వరకు ప్రభాస్ సలార్ సినిమా లో ఎలా ఉంటాడు… ఏ పాత్ర లో కనిపించబోతున్నాడు అనే విషయం లో స్పష్టత కాస్త తక్కువగానే ఉంది.అయినా కూడా ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో చూపిస్తాడో అనే ఒక ఊహ అందరిలో కూడా క్లీయర్ గా ఉంది.
అందుకే సలార్ సినిమా ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది అంటూ అంతా కూడా చాలా నమ్మకంతో ఉన్నారు.
ఆకట్టుకునే ప్రభాస్ లుక్ తో ఒక మంచి టీజర్ ను తీసుకు రాబోతున్నట్లుగా అంతా కూడా నమ్మకంగా ఉన్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల విషయం లో మేకర్స్ చాలా ముందస్తు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.టీజర్ విడుదల మొదలుకుని ప్రతి ఒక్క విషయం లో భారీతనం కనిపించే విధంగా సలార్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా ప్రభాస్ ని ప్రమోషన్ కార్యక్రమాల్లో చూపించడం కోసం ప్రత్యేకంగా వీడియోలు రెడీ చేస్తున్నారట.ఇక ఈవెంట్స్ మరియు మీడియా సమావేశాలు.జాతీయ స్థాయి మీడియాలో కవరేజ్ ఇలా అన్నింటి కోసం కూడా సలార్ సినిమా నిర్మాతలు ఏకంగా అయిదు నుండి పది కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.500 కోట్ల కు పైగా అయ్యే అవకాశాలు ఉన్నాయి.సినిమా కు ఉన్న బజ్ నేపథ్యం లో ఆ స్థాయి ప్రమోషన్ చేస్తేనే ఏమైనా ఫలితం ఉంటుంది అని మేకర్స్ భావిస్తున్నారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ లో ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేయడం జరిగింది.అంతే కాకుండా హీరోయిన్ గా శృతి హాసన్ ( Shruti Haasan )నటించడం జరిగింది.
సినిమా లో బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు నటించారు.కేజీఎఫ్ రెండు భాగాలు సూపర్ హిట్ అవ్వడం వల్ల సలార్ సినిమా కు పాన్ ఇండియా రేంజ్ లో ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి.