ప్రభాస్ తో నటించాలనుందా.. అయితే ఈ పని చెయ్యండి!

సాధారణంగా చాలా మందికి సినిమాలో చిన్న చిన్న పాత్రలలో నటించాలనే కోరిక ఉంటుంది.అయితే అవకాశాల కోసం చాలామంది చేయని ప్రయత్నం అంటూ లేదు.

 Hero Prabhas Movie Project K Team Calls For Auditions,  Prabhas, Tollywood, Hero-TeluguStop.com

ఇలా ప్రయత్నం చేసేవారికి అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది ఓ చిత్ర బృందం.ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చిత్రాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ పూజ హెగ్డే జంటగా నటించిన టువంటి “రాధేశ్యామ్” సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలోనే ప్రభాస్ శృతిహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” సినిమా తెరకెక్కుతోంది.ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో రామాయణం తరహాలో తెరకెక్కుతున్న చిత్రం “ఆదిపురుష్” .ఇందులో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా కృతి సనన్ సీతగా కనిపించనున్నారు.ఈ సినిమాలు మాత్రమే కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాను చేయనున్నట్లు మనకు తెలిసిందే.

వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు “ప్రాజెక్ట్ కే” అనే పేరుతో షూటింగ్ పనులను జరుపుకుంటోంది.టైం ట్రావెల్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఈ చిత్ర బృందం సినిమాలలో నటించాలనే కోరిక ఉన్న వారికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది అని చెప్పవచ్చు.

“ఫేసెస్ ఆఫ్ ఫ్యూచర్” అనే పేరుతో సినిమాలలో నటించడం కోసం కొత్త నటీనటులను ఆహ్వానిస్తున్నాము అని చిత్రబృందం వెల్లడించారు.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2 బెంగళూరు, చెన్నై 15 పుదుచ్చేరి, కొచ్చి ఈ క్యాస్టింగ్ ఉంటుందని పేర్కొంటూ సినిమాలలో ఏ పాత్రలోనైనా నటించడానికి ఆసక్తి ఉన్నవారు తమకు మెయిల్ చేయాలని స్పష్టం చేశారు.నిజంగా సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube