మరోసారి ఆదిపురుష్‌ లో జాయిన్‌ అవ్వబోతున్న ప్రభాస్‌.. మొదటి సీనే అదట

ఆల్ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.30 శాతం సినిమా ఒరిజినల్ ఉండనుండగా 70 శాతం వరకు విజువల్‌ ఎఫెక్ట్ సీన్స్ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల విశ్వసనీయ సమాచారం.ఈ సినిమా కోసం నటీ నటులు కేవలం నాలుగు నుండి ఆరు నెలల పాటు మాత్రమే నటించబోతున్నారు.ఆ తర్వాత మొత్తం కూడా ఈ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్ వర్క్‌ జరుపబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

 Prabhas May Be Join In Adipurush Movie Shooting In This Week-TeluguStop.com

పెద్ద మొత్తంలో ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌ ను విదేశాల్లో చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్‌ కోసం దర్శకుడు ఓం రౌత్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో ప్రభాస్ రాముడి గా కనిపించబోతున్నాడు.

 Prabhas May Be Join In Adipurush Movie Shooting In This Week-మరోసారి ఆదిపురుష్‌ లో జాయిన్‌ అవ్వబోతున్న ప్రభాస్‌.. మొదటి సీనే అదట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దర్శకుడు ఓం రౌత్‌ మార్చి మొదటి వారం నుండి ఆది పురుష్‌ కొత్త షెడ్యూల్ కు ప్లాన్‌ చేశాడు.

భారీ తారాగణంతో ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన మోషన్‌ క్యాప్చర్‌ ను కూడా చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఆది పురుష్‌ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే విషయమై ఈ షెడ్యూల్‌ లో క్లారిటీ ఇస్తారనే ఉద్దేశ్యంతో అంతా ఆసక్తిగా ఉన్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్ విషయమై ప్రభాస్ మరో రెండు రోజుల్లో ముంబయికి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రాముడిగా ప్రభాస్‌ రెగ్యులర్ గా కాకుండా చాలా విభిన్నంగా కనిపిస్తాడంటూ సమాచారం అందుతోంది.ఈ సినిమా తో పాటు ప్రభాస్‌ రాధేశ్యామ్‌ మరియు సలార్‌ సినిమా ల షూటింగ్‌ ల్లో కూడా పాల్గొంటున్నాడు.

త్వరలోనే ఈ మూడు సినిమా ల షూటింగ్ లను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

#PrabhasHindhi #Adipurush #Om Routh #TeluguPrabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు