ప్రభాస్ మారుతి కాంబో మూవీ పీపుల్స్ మీడియా బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మారుతి గత సినిమా పక్కా కమర్షియల్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా మారుతిపై ఉన్న నమ్మకంతో ప్రభాస్ ఛాన్స్ ఇచ్చారు.త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుండగా ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ ను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది.
కేజీఎఫ్2 సినిమాలో సంజయ్ దత్ విలన్ రోల్ లో నటించగా ఆ సినిమాకు సంజయ్ దత్ ప్లస్ అయిన సంగతి తెలిసిందే.మారుతి తన సినిమాలలో రెగ్యులర్ గా నటించే నటులను ప్రభాస్ సినిమా కోసం ఎంపిక చేయడం లేదని బోగట్టా.సంజయ్ దత్ ప్రభాస్ సినిమాలో విలన్ గా నటించడానికి ఓకే చెబితే ఈ సినిమాకు పాన్ ఇండియా లుక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది.అన్ని భాషల నటులకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాలని మారుతి భావిస్తున్నారు.

ఈ సినిమా ఒక విధంగా మారుతి కెరీర్ ను డిసైడ్ చేయనుంది.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే మారుతికి కొత్త సినిమా ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
మలయాళ, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులు సైతం ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించే ఛాన్స్ అయితే ఉంది.భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా మారుతి కోరుకున్న విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ సినిమాకు మారుతి పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.నటీనటుల ఎంపిక విషయంలో మారుతి మారాడంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.