ఫిక్స్ అయిన ప్రభాస్ పెళ్లి జరిగే ప్లేస్... పెళ్లి ఎప్పుడంటే...

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రభాస్ కెరీర్లో చేసింది కొన్ని సినిమాలే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే సంపాదించాడు.

 Prabhas, Marriage Venue, Tollywood Hero, Saaho, America-TeluguStop.com

అంతేగాక బాహుబలి తెలుగు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచానికి పరిచయం చేశాడు.అంతేగాక పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో కూడా నటించాడు.

అయితే ఇటీవల ప్రభాస్ నటించినటువంటి “సాహో” చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ దర్శక నిర్మాతలకు మాత్రం కాసుల వర్షం కురిపించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి చర్చ మాత్రం గట్టిగానే సాగుతోంది.

తాజాగా ప్రభాస్ పెళ్లి జరిగే వేదిక గురించి పలు వార్తలు నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ఇందులో ప్రభాస్ కుటుంబానికి సంబంధించిన కొందరు పెద్దలు ప్రభాస్ పెళ్లిని అమెరికాలో జరిపించాలని సన్నాహాలు చేస్తున్నారట.

అంతేగాక పెళ్లి కూతురు కూడా అమెరికాకు చెందినటువంటి ఓ ప్రముఖ భారత సంతతి వ్యాపారవేత్త కూతురని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే ప్రభాస్ కి కాబోయే భార్య ఎవరన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.

అయితే ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్ కి సంబంధించినటువంటి రెండు చిత్రాల్లో నటిస్తున్నాడని ఈ చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే.

కే రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్నటువంటి “జాన్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అలాగే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా దాదాపుగా 60 శాతం పూర్తి అయ్యాయి.

అయితే ఇటీవలే యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నటువంటి మరో కొత్త చిత్రానికి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube